వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టింది.అందులోభాగంగానే రైతులకు ఏడాదికి ఎకరానికి 8వేల చొప్పున రైతు బంధు పథకం పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్నది.రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంతోషంగా ప్రభుత్వం ఇస్తున్న చెక్కులను , పాసు పుస్తకాలను తీసుకుంటున్నారు. అందులోభాగంగానే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు.
Under the #RythuBandhu scheme, farmers of Namapur village in Rajanna Sircilla district were handed over new pattadaar passbooks and cheques by Minister @KTRTRS. Peddapalli MP @balkasumantrs, MLC Naradasu Laxman Rao also participated in the program. pic.twitter.com/MBqHHB6fLu
— Min IT, Telangana (@MinIT_Telangana) May 17, 2018
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీ ఆర్ మాట్లాడారు.వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు.దేశంలో ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.గత పాలకులు రూ.200 పెన్షన్ కోసం ముప్పు తిప్పలు పెట్టారని అన్నారు.రైతు బంధు పథకం చెక్కుల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని.. రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎక్కువ ఆత్మ సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్సీ నారదాసు పలువురు ప్రజాప్రతినిధులు,రైతులు పాల్గొన్నారు.