జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే సినిమాలకు గుడ్‌బై చెప్పేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయ వాతావరణం వేసవి కాలాన్ని సైతం తలదన్నేలా వేడిని రాజేస్తున్నాయి. అంతేకాకుండా, ఒకరికొకరు వ్యక్తిగత ధూషణల వరకు వెళ్లి.. మీపై కేసులు పెడతాం అంటూ ఒకరంటే.. మీపై కూడా కేసులు పెడతామంటూ మరొకరు ఇలా రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇదే అదునుగా భావించిన పలు టీవీ ఛానెళ్లు వారి వారి టీఆర్పీ రేటింగ్‌ను పెంచుకునే పనిలో పడ్డాయి. ఒక్కో రోజు ఒక్కో రాజకీయ నాయకుడితో డిబేట్ నిర్వహిస్తూ కాంట్రీవర్సీలను సృష్టిస్తూ టీఆర్పీ రేటింగ్స్‌ను పెంచేసుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రజా సమస్యలపై పోరాటమో..లేక ఎన్నికల ప్రచారమో తెలీదు కానీ.. ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బస్సు యాత్ర చేసేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మే 13వ తేదీ ఆదివారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పవన్ కల్యాన్ దర్శించుకున్నారు. ఆ తరువాత జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేతల మధ్య పవన్ కల్యాణ్ చిత్తూరు రోడ్ షో నిర్వహించారు. ఇదే సందర్భంలో అందరూ ఆశ్చర్యపోయేలా ఒక సంఘటన చోటు చేసుకుంది.
పవన్ కల్యాన్ కారులోపల నుంచి.. కారు టాప్ మధ్యలో నిలబడి.. ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని అజ్ఞాత వాసి కారు టాప్ పైకెక్కి ఒక్కసారిగా పవన్ కల్యాన్‌ను కౌలిగించుకున్నాడు. అప్పటి వరకు ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో అప్పటి వరకు ఏమరుపాటుగా ఉన్న పవన్ కల్యాణ్ సెక్యూరిటీ.. తేరుకుని ఆ అజ్ఞాతవాసిని (గుర్తు తెలియని వ్యక్తిని) కారు టాప్ నుంచి కిందకి దించేశారు.
ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో మరోలా కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే పడన రాజకీయ పార్టీనే ఇదంతా దగ్గరుండి చేయించిందని, ఆ రాజకీయ పార్టీ చేయించిన ఈ పనితో.. ఆ సమయంలో పవన్ కల్యాన్‌కు ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించి ఉండేవారని..? ఏదేమైనా నీ జాగ్రత్తలో నీవు ఉండాలంటూ పవన్ కల్యాణ్‌ను క్షేమాన్ని కోరుతూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. మరొకరేమో.. ఆ సమయంలో ఆ గుర్తు తెలియని వ్యక్తి చేతిలో బ్లేడ్‌ను చూశానని కామెంట్ చేయడం గమనార్హం.