వైసీపీ పార్టీని విమర్శించేందుకు టీడీపీకి సిగ్గుండాలని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, ఆ పార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్ బాబు వ్యాఖ్యానించారు. గురువారం అంజద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీలో కడప అంటే ఏంటో చూపించిన నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు.
కేసులు పెడతారని తెలిసి కూడా కొత్త పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. ఏపీకి ప్రతేక హోదా కోసం తమ పదవులకు రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలను.. రాజీనామాలను ఆమోదించుకుని ఎన్నికలకు రావానలి టీడీపీ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. అందులో భాగంగానే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి.. తిరిగి వైసీపీపై విమర్శలు చేయడం దారుణం అన్నారు.