ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోనున్నారా ..గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే గెలుపొందిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారాని పూలలో పెట్టి ఇస్తారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు విషయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు దేశవ్యాప్తంగా కాకుండా ఏకంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టీటీడీలోని అర్చకులను అరవై ఐదేళ్ళు దాటితే తొలగించాలని నిర్ణయం తీసుకుంది .
అయితే ఇటివల టీటీడీ కొత్తపాలక మండలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తోలి పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో పెను సంచలనం సృష్టిస్తుంది.అయితే టీటీడీలో టీడీపీ నేతలు దోచుకోవాలనే కావాలనే అన్ని తెల్సిన నరసింహ దీక్షితులు ,ప్రధాన అర్చకుడు అయిన రమణ దీక్షితులు ,శ్రీనివాస మూర్తి దీక్షితులు,నారాయణ దీక్షితులను ప్రభుత్వం తొలగించనున్నది.ఈ అంశం గురించి హిందువాదులు ,రాజకీయవర్గాలు స్పందిస్తూ దేవుడికి సేవ చేయడానికి వయో పరిమితి ఏమిటి.ఇదెక్కడి చోద్యం .ఇలా దేశంలో ఎక్కడైనా జరిగిందా ..
టీటీడీలో ఉన్న లక్షల కోట్ల సొమ్మును దోచుకోవడానికే తమకు అడ్డుగా ఉన్న దీక్షితులందరినీ బాబు సర్కారు తొలగిస్తుంది.దేవుడితో పెట్టుకున్నవారు ఎవరు బాగుపడలేదు.రానున్న ఎన్నికల్లో ఈ ప్రభావం తప్పకుండ ఉంటుందని అంటున్నారు.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకొన్న తీరుకు ,చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు విరక్తి చెంది వచ్చే ఎన్నికల్లో బాబు సర్కారుకు బుద్ధి చెప్పాలని కసితో ఉన్న ప్రజలకు దేవుడు దీవెనలు కూడా తోడవ్వడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోయి వైసీపీ అధికారంలో కి రావడం ఖాయమంటున్నారు రాజకీయ వర్గాలు ..