గాలి జనార్ధన్ రెడ్డి వేసిన స్కెచ్ తో కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది .అందులో భాగంగా తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత బలం లేకపోయిన కానీ నిన్న బుధవారం బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఏకంగా గవర్నర్ వాజ్ భాయ్ ను కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు .
దీంతో ఈ రోజు గురువారం యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు .అయితే బలనిరుపణకు గవర్నర్ పదిహేను రోజులు సమయం ఇచ్చారు .ఈ క్రమలో రంగంలోకి దిగిన గాలి జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ఈగిల్టన్ రిసార్ట్ నుండి తప్పించడానికి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి .
దీంతో వీరిద్దరూ మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి శిబిరంలోకి చేరిపోయారు .దీంతో బీజేపీ పార్టీకి మద్దుతు నూట ఏడు ఎమ్మెల్యేలకు పెరిగింది .మరో పద్నాలుగు రోజుల్లో మిగిలినవారిని కూడా లాక్కోవడానికి గాలి నేతృత్వంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు బీజేపీ నేతలు ..