కాంగ్రెస్ బ్లండర్ మిస్టేక్..! కాస్త మీరైనా బ్రీఫండి పచ్చ తమ్ముళ్లు..!! అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ భావుటా ఎగురవేస్తుందని అందరూ భావించారు. ఆఖరకు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ తమ సర్వేలో వెల్లడైన ఫలితాలను ప్రచురించాయి. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా ఓట్ల శాతం తగ్గినప్పటికీ బీజేపీ అత్యధికంగా 104 సీట్లను గెలచుకుని కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
పోలింగ్ వరకు కాంగ్రెస్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న సంకేతాలు ఇచ్చిన వారంతా.. ఈవీఎంల రిజల్ట్‌తో ఖంగుతిన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ఓట్లశాతం ఎక్కువగా వచ్చినప్పటికీ అసెంబ్లీ సీట్ల సంఖ్య తగ్గడంపైనే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. అందులో మొదటిగా వినిపించే పేరు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాగా, రెండో వ్యక్తిగా ప్రధాని మోడీ పేరు వినిపిస్తుంది. వీరిద్దరూ పన్నిన వ్యూహాలను కాంగ్రెస్ నేతలు సైతం ఎదుర్కోలేక పోయారని, అమిత్ షా, మోడీల రాజకీయ చాణుక్యత ముందు మహావృక్షంగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ డీలా పడిందన్నది రాజకీయ విశ్లేషకుల భావన.
అలాగే, కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమి వెనుక చంద్రబాబు అత్యుత్సాహం కూడా కారణమన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా టీడీపీ నేతలతో కర్ణాటకలో చంద్రబాబు ప్రచారం చేయించిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేత అశోక్‌బాబు కర్ణాటక ప్రచారం కూడా అందులో భాగమే.
కర్ణాటకలోని తెలుగువారి ఓట్ల కోసం చంద్రబాబు ఇలా చేయించిన ప్రచారమే కాంగ్రెస్ కొంప ముంచింది. ఏపీకి ప్రత్యేక హోదా, ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న చంద్రబాబు మాటలు నమ్మితే మళ్లీ మోసపోతామని భావించిన కన్నడ తెలుగు ప్రజలు.. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేశారని, అందులో భాగంగానే తెలుగు ఓటలు ఎక్కువగా ఉన్నచోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారంటూ సోషల్ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. ఇలా చంద్రబాబు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తూ చేసిన అత్యుత్సాహ ప్రచారమే.. సిద్ధరామయ్య కొంపమునగడంతో భాగమైందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.