పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని గతంలో సినీ నటి ఖుష్భూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి వాఖ్యలు మరోనటి చేసింది. తమిళంలో రిలీజై విడుదలైన ఓ అడల్ట్ సినిమాలో నటించి.. పాపులర్ అయిన యాషిక ఆనంద్.. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పలు వివాదాస్పదమైన కామెంట్లు చేసింది. పెళ్లికి ముందే అమ్మాయిలు శృంగారం పాల్గొనడం సరైందా అనే ప్రశ్నకు యాషిక స్పందిస్తూ.. పెళ్లికి ముందే అమ్మాయిలు కన్యత్వం కోల్పోవడంలో తప్పు లేదని బోల్డ్‌గా బదులిచ్చింది.
అంతేగాకుండా అబ్బాయిలు ఎలాగైతే పెళ్లికి ముందు శృంగారాన్ని ఇష్టపడతారో.. అమ్మాయిలూ అంతే. అందులో తప్పేం లేదు. ఎవరిష్టం వాళ్లది అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే తాను పోర్న్ వీడియోలను ఎక్కువగా చూస్తానని, ఓసారి ఇంట్లో పోర్న్ వీడియోలు చూస్తూ తల్లిదండ్రులకు దొరికపోయానని తెలిపింది. అయినా వారేం అనలేదని యాషిక తెలిపింది. ప్రస్తుతం నటి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.