ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి ,జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు .అయితే ఈ సారి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన సతీమణి వైఎస్ భారతి పై కూడా విరుచుకుపడ్డారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలను ఆకర్శించుకోవడానికి ..అధికారాన్ని అడ్డదారిన హస్తగతం చేసుకోవడానికే జగన్ పాదయాత్ర చేస్తున్నారు .గతంలో తండ్రిని అడ్డుపెట్టుకొని దోచుకున్న ఆస్తులను పెంచుకునేందుకే జగన్ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు .
భారతి సిమెంట్ తనది కాదని అంటున్న జగన్ చివరికి జగన్ భారతిని తన భార్య కాదు అని కూడా అంటాడు అని ఆయన విరుచుకుపడ్డారు .ఉప ఎన్నికలు జరిగితే జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు టీడీపీ పార్టీకే దక్కుతాయి అని ఆయన అన్నారు ..