ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.గతంలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడుకు ప్రధాన భద్రతా అధికారిగా పనిచేసిన రాయలసీమ మాజీ ఐజీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .
ఈ క్రమంలో ప్రస్తుతం గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో రాయలసీమ ఐజీగా ఇటివల రిటైర్డ్ అయిన షేక్ మహ్మద్ ఇక్భాల్ నిన్న బుధవారం వైసీపీ గూటికి చేరారు .ఈ సందర్భంగా ఆయనకు జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ..