ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియకు ఫోన్..! విల విలా విలపించిన మంత్రి అఖిల ప్రియ..! కారణం తెలిస్తే షాక్..!!
కాగా, మంగళవారం మధ్యాహ్నం సమయంలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోగల మంటూరు వద్ద గోదావరి నదిలో లాంచీ మునిగి 55 మంది గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. మిగతా ఈత రాని వారు.. లోపల కూర్చున్నవారు లాంచీతో సహా 60 అడుగుల లోతులో మునిగిపోయారు.
అయితే, ఈ సంఘటనను ఉద్దేశించి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నిజంగా బాధ కలిగించింది. ఇటువంటి ఘటనలు ఒక సారి జరిగితే ఏమరపాటు అనుకోవచ్చు. కానీ. నెలకొకటి లెక్కన జరుగుతూ అమాయకులు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ సందర్భంలోనే గత సంవత్సరం నవంబర్‌లో జరిగిన పడవ బోల్తా ఘటన, అలాగే, ఈ సంవత్సరం ఇదే (మే) నెలలో గత ఐదు రోజుల క్రితం జరిగిన పడవ ఘటనను వైఎస్ జగన్ గుర్తు చేశారు. మళ్లీ అటువంటి ఘటనే నేడు చోటు చేసుకోవడం చాలా విచారకరమన్నారు.
రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. దీనికంతటికి కారణం.. టీడీపీ కింది స్థాయి కార్యకర్తల నుంచి.. పైత స్థాయి నేతల వరకు లంచాలకు అలవాటు పడి.. ప్రభుత్వ అధికారులను బెదిరించి మరీ బోట్లకు లైసెన్సులు తీసుకోవడమేనని జగన్ అన్నారు.
ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, బోటు ప్రమాదాలను ఎత్తిచూపుతూ.. ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో.. పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న అఖిల ప్రియకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంఘటన జరిగి ఒక్క రోజు గడుస్తున్నా… ఘటనా స్థలికివెళ్లి.. సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయి….? చర్యలేమన్నా తీసుకోవాలా..? ఘటనకు బాధ్యులెవరు..? అన్న విషయాలపై దృష్టి సారించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం మంత్రి స్థాయిలో ఉన్న నీకు తగదంటూ క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.
అయితే, మంత్రి అఖిల ప్రియకు చంద్రబాబు క్లాస్ తీసుకోవడం కొత్తేమీ కాదు. బోటు ప్రమాదాలు జరిగిన ప్రతీసారి అఖిల ప్రియకు ఫోన్ చేయడం.. తిట్ల దండకం ప్రారంభించడం చంద్రబాబుకు అలవాటే కదా..! అంటూ చంద్రబాబుపై, అఖిల ప్రియపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.