బంగారం ప్రియులకు శుభవార్త. బుధవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ బాగా తగ్గిపోవడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. ఒక్కరోజే రూ.430 తగ్గిపోయింది. నేటి మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 తగ్గి రూ.32,020గా ఉంది. మరోవైపు, వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండి ధర రూ.250 తగ్గి రూ.40,650గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ బాగా తగ్గిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1300డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర 1.52శాతం తగ్గి 16.24డాలర్లుగా ఉంది. రాజధాని దిల్లీలో 99.9శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.430 తగ్గి రూ.32,020గా ఉండగా 99.5శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.31,870గా ఉంది. నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధర పది గ్రాములకు రూ.165 పెరిగింది. కాగా, ఈ రోజు బాగా తగ్గిపోయింది.