దేశం అంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న బుధవారం వెలువడిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది స్థానాలు ,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది స్థానాలు ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే.
అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ అంతా మెజారిటీ రాకపోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్న జేడీఎస్ పార్టీ వైపు చూస్తున్నారు .ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికీ తెలియని చోట ఒక ప్రముఖ రిసార్ట్ లో క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తుంది.
అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు క్యాంపు నుండి జంప్ అయ్యారు అని రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది .అయితే ఈ ఐదుగురు కాకుండా ఏకంగా జేడీఎస్ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా జంప్ కావడానికి సిద్ధమైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి .