ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద హత్య యత్నం కేసు నమోదు కానున్నదా ..?. అయితే నారా చంద్రబాబు నాయుడు మీద ఈ హత్యాయత్నం కేసు నమోదు అవ్వడం
ఎటువంటి పరిణామాలకు దారిస్తుందో ..ఎందుకు పెట్టాలో చెబుతున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..
నిన్న మంగళవారం పశ్చమ గోదావరి ,తూర్పు గోదావరి జిల్లాల మధ్య గోదావరి నదిలో జరిగిన లాంచీ బోల్తా సంఘటనలో నలబై మంది మృతి చెందిన సంగతి తెల్సిందే .అయితే ఈ సంఘటన మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి
మాట్లాడుతూ ఈ సంఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు .
ఆయన మాట్లాడుతూ గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఇరవై ఒక్క మంది మరణించిన సమయంలోనే తగిన చర్యలు తీసుకొని ఉండి ఉంటె ఇలాంటి సంఘటనలు అసలు జరగవు .గత నాలుగు ఏండ్లుగా అనేక బోటు ప్రమాదాలు జరుగుతున్నాయి .అయిన కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం .ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఐదు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ..చంద్రబాబు నాయుడు మీద హత్య
యత్నం కేసును నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు .