ఏపీలో గత కొంతకాలంగా వరసగా పలు చోట్ల బోటుల ప్రమాదం ,పడవలు బోల్తా పడటం మనం గమనిస్తూనే ఉన్నాం .గతంలో ఏకంగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడి పద్దెనిమిది మంది చనిపోయిన కానీ పాఠం నేర్చుకోలేదు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని సర్కారు .తాజాగా రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి ,తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం మధ్య మంటూరు గ్రామాల మధ్య మొత్తం యాబై ఐదు మందితో ప్రయాణిస్తున్న లాంచీ బోల్తా పడి మునిగిపోయింది.
అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం నలబై మంది గల్లంతయ్యారు.అయితే లాంచీ నిర్వాహకులతో పాటుగా అందులో ఉన్నవారు అంతా మునిగిపోయారు.అయితే లాంచీపై కూర్చున్న పదిహేను మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం అందులో ఉన్న సిమెంటు బస్తాలు అని అక్కడ ఉన్న ప్రత్యేక్ష సాక్షుల కథనం .అంతే కాకుండా ఆ లాంచీ సరిగ్గా సదుపాయాలు లేవని ..నియమాలకు అనుగుణంగా లేదని లైసెన్స్ రద్దు చేయగా ఇటివల మంత్రిగా భాద్యతలు స్వీకరించిన ఒకరు దగ్గర ఉండి మరి మరల అనుమతులు జారిచేశారు అని ఆ లాంచీ గురించి తెల్సినవారు చెబుతున్నారు
.మొత్తం యాబై ఐదు మంది ఉన్న లాంచీ అనుకోకుండా వీచిన గాలులకు అతలాకుతలం అవుతుంటే లాంచీలోకి నీళ్ళు రావడంతో అవి తడవకుండా ఉండేందుకు తలుపులు అన్ని మూసేయడంతో బరువు ఎక్కవై లాంచీ ముంగిపోయింది.అయితే బస్తాలు ఉండటంతో వారు బయటకు రావడానికి వీలులేక అందులోనే ఉండి మునిగిపోయారు .అయితే లాంచీ నియమాలకు అనుకూలంగా లేకపోయినా కానీ ప్రభుత్వ పెద్దలు కాసులకు ఆశపడి ఇలా చేయడం వలనే ఇంతటి ఘోర ప్రమాదానికి గురైంది అని స్థానికులు టీడీపీ సర్కారు మీద విరుచుకుపడుతున్నారు.