తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నంలో జరిగిన బోటు ప్రమాద ఘటన పూర్తిగా ప్రభుత్వ తప్పిదంతోనే జరిగిందనీ, ఇటువంటి ఘటనలు ప్రభుత్వ హత్యలే అని ఏపీ ప్రతిపక్ష నాయకుడు ,వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పడవ ప్రమాదం ఘటన చాలా బాధ కలిగించిందనీ, దాదాపు 40 మంది మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. అక్రమంగా తిరగుతున్న వంద బోట్లను కూడా నివారించలేని పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదంటే నిర్లక్షానికి నిదర్శనం అని అన్నారు.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పడవ ప్రమాదాల నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వంపై హత్య కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా బోట్లను ఇష్టా రాజ్యంగా తిప్పుతున్నారంటే, మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా లంచాలు ముట్టుతుండటమే కారణమనీ జగన్ ఆరోపించారు. అందుకనే సాక్షాత్తూ ముఖ్యమంత్రి కళ్లెదుట నుంచే ఎటువంటి లైసెన్సులులేని బోట్లు యధేచ్చగా తిరుగుతున్నాయని అన్నారు. గతంలో జరిగిన ఘటనలపై వేసిన విచారణలేమయ్యాయో అని, అవికూడా టీవీ సీరియళ్ల మాదిరిగా సాగుతూ ఉంటాయని వ్యంగ్యంగా అన్నారు.
గత ఏడాది నవంబరులో సిఎం ఇంటి పక్కనుంచే కృష్ణా నదిలోపడవ మునిగి 21 మంది చనిపోయారనీ, మళ్లీ అయిదు రోజుల కిందట బోటులో అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా దగ్ధమైపోయిందని అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగని సంగతిని ఆయన గుర్తుచేశారు.ఆరు నెలల కాలంలో మూడు సంఘటనలు జరగడం లైసెన్సులు, భద్రతా ఏర్పాట్లు వంటి వాటిపై ఏమాత్రం దృష్టి సారించకపోవడానికి కారణం ముఖ్యమంత్రి ఆయన కుమారుడు,మంత్రులకు వాటాలు అందుతుండటమే అని తీవ్రంగా మండిపడ్డారు.
పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న అఖిల ప్రియ సంఘటన జరిగి ఒక్క రోజు గడుస్తున్నా… ఘటనా స్థలికివెళ్లి.. సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయి….? చర్యలేమన్నా తీసుకోవాలా..? ఘటనకు బాధ్యులెవరు..? అన్న విషయాలపై దృష్టి సారించకుండా మంత్రి స్థాయిలో ఉన్న అసలే ఏమీ తెలియనట్లు ఉందంటే అమె ఇంకా రాజీనామాకి సిద్దం అయినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అంతేకాదు ఇటీవల ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు అఖిల ప్రియ వర్గీయులు దాడి చేశారంటు చంద్రబాబు దగ్గర మొర పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఫైర్ అయిన బాబు అఖిలప్రియను అమరవాతికి రావాలని పిలుపునిచ్చారు. అయిన లేక్క చేయ్యకుండా వేల్లలేదు. అంటే ఇక పార్టీకి గుడ్ బై చేప్పాలని అనుకుంటుంది కాబట్టి టీడీపీ చేసే ఏ కార్యక్రమలకు హాజరు అవ్వడం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.