ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు . తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ అడుగు పడిన రోజే చంద్రబాబుకు సూపర్ షాక్ తగిలింది. రెండున్నర దశాబ్ధాల పాటు బాబుకు అత్యంత సన్నిహిత నాయకుడిగా ఉన్న టీడీపీ నాయకుడు వైఎస్ జగన్ పార్టీలో చేరడం ఖాయం అయింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నాయకుడిగా రెండు దశాబ్ధాలు కొనసాగిన చరిత్ర ఆ నాయకుడిది.
పశ్ఛిమ గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నాయకుడు బొడ్డు భాస్కర రామారావు టడీపీ వీడాలని నిర్ణయించుకున్నారు. పెద్దాపురం సీటు విషయంలో చంద్రబాబు రాజకీయాలు తట్టుకోలేకే టీడీపీని వీడుతున్నాడని తెలుస్తోంది. చంద్రబాబు రాజకీయాలను అస్సలు నమ్మలేమని…..వైసీపీలోకి వెళ్ళడమే మంచిదని ఆయన సన్నిహితులు అభిప్రాయపడడంతో ఈ మాజీ ఎమ్మెల్సీ, చంద్రబాబు సన్నిహితుడు అయిన నాయకుడు ఇప్పుడు వైసీపీ నాయకులకు టచ్‌లోకి వెళ్ళాడట. జగన్ కనుక పెద్దాపురం సీటు కన్ఫాం చేస్తే మాత్రం వెంటనే వైసీపీలో చేరడానికి రెడీ అన్న సంకేతాలు వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణకు ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ టీడీపీ నాయకుడి చేరిక విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.