ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు ,మోసాలు క్లైమాక్స్ కు చేరాయని ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రతో బాగంగా ఏలూరు లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఈరోజుకి క్లైమాక్స్‌కు చేరాయి. రోజుకో కొత్త సినిమా చూపిస్తున్నాడు. ఒక పూట నిరాహార దీక్ష అంటాడు. దాని కోసం సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.30 కోట్లు ఖర్చు చేస్తాడు. ఒక పూటలో చంద్రబాబు బాబా అవతారం ఎత్తుతాడు.
అందరూ వచ్చి బాబా బాబా అని ఆయన కాళ్లకు మొక్కుకుని పోవాలట. ఎన్టీ రామారావు డూప్‌ను తీసుకొచ్చాడు. పాపం ఆయన ఏ లోకంలో ఉన్నాడో గానీ చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటుకు తేరుకోలేకపోయాడు ఎన్టీ రామారావు. ఆయన్ను కూడా ఇవాళ బాబు డ్రామా కోసం వాడుకున్నాడు. ఆ డూప్.. చంద్రబాబును ఆశీర్వదిస్తున్నట్టు డ్రామాలు.. నిజంగా పద్మభూషణ్‌లు, పద్మశ్రీలు, ఆస్కార్ అవార్డులు ఇచ్చేవాళ్లు చంద్రబాబునాయుడిని చూడలేదేమో. చూసి ఉంటే మాత్రం ఉత్తమ విలన్ అవార్డు చంద్రబాబుకే దక్కేది.ఈయనగారి మోసాలు ఎలా ఉన్నాయంటే విశాఖపట్నంలో పార్టనర్‌షిప్ సమ్మిట్ అంటాడు. రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటాడు. నిజంగా వచ్చాయా? ఇలాంటి నాయకుడు అవసరమా? అబద్ధాలు చెప్పే, మోసాలు చేసే నాయకుడు కావాలా? ఇలాంటి నాయకుడిని క్షమిస్తే రేపు ఇంటింటికీ కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్ కారు ఇస్తానంటాడు. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటెయ్యండి.”అని వైఎస్ జగన్ అన్నారు.