మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరుపున ముమ్మరంగా ప్రచారం చేసిన ప్రధాని మోడీ.. ప్రచారం ముగిసిన వెంటనే మళ్లీ దేశ పరిపాలనపై దృష్టి సారించారు. అయితే, ప్రధాని మోడీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ప్రధాని మోడీ తీసుకున్న ఆ సంచలన నిర్ణయమేంటనేగా మీ ప్రశ్న..??
ఇక అసలు విషయానికొస్తే. దేశంలో పర్యావరణానికి నష్టం తెచ్చే విభాగాల్లో వాహన శ్రేణిదే మొదటి స్థానమన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నెంబరింగ్ సిస్టం ద్వారా ఒక్కో రోజు ఒక్కో నెంబరింగ్ సిస్టంగల వాహన శ్రేణికి నగరాల్లోని రహదారిపై తిరిగేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.
అయితే, ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేయనుంది. పర్యావరణానికి నష్టం తెస్తున్న పెట్రోల్, డీజిల్ వాహన శ్రేణిలకు స్వస్తి పలికి.. ప్రజలు విద్యుత్ వాహనాలు వాడేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా, విద్యుత్ వాహనాలు వాడే వారికి మోడీ సర్కార్ సబ్సిడీలను కూడా ప్రకటించాలని భావించింది.
విద్యుత్ వాహనాలను ఉపయోగించే వారికి ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇచ్చేందుకు గాను ఆకుపచ్చ బోర్డును మోడీ సర్కార్ ఏర్పాటు చేయనుంది. దీంతో విద్యుత్ వాహనదారులకు సబ్సిడీలు లభించనున్నాయి. ముఖ్యంగా టోల్‌ప్లాజా రుసుములో తగ్గింపు, అలాగే, అత్యంత రద్దీగల నగరాల్లో అన్ని చోట్లా పార్కింగ్‌కు అనుమతి ఇవ్వనున్నారు. అయితే, ప్రధాని మోడీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతోనైనా దేశంలో కాలుష్య శాతం తగ్గుతుందమో వేచి చూడాలి.