యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి .అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాలకు ఇటివల ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే .
ఈ రోజు మంగళవారం ఉదయం నుండి ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ చాలా రసవత్తంగా సాగుతుంది .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదకొండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,బీజేపీ పార్టీ తొంబై ఐదు ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నాయి .
అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ అన్ని స్థానాల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులపై భారీ ఆధిక్యంలో ఉన్నట్లు కర్ణాటక రాష్ట్రంలో వార్తలు వస్తున్నాయి ..