ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు శుభవార్తను ప్రకటించారు వైఎస్
జగన్మోహన్ రెడ్డి .పాదయాత్రలో భాగంగా ఆయన్ని పలువురు ఆటో డ్రైవర్లు ,సామాన్య ప్రజానీకం దగ్గర నుండి ఉద్యోగుల వరకు ,మహిళల నుండి రైతన్నలవరకు ,విద్యార్థులు దగ్గర నుండి నిరుద్యోగ యువత వరకు అందరూ జగన్మోహన్ రెడ్డిని కల్సి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు .
ఈక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు నడుపుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్లను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ “ఏపీలో ఆటోడ్రైవర్ లకు సరి కొత్త హామీ ఇచ్చారు. కొత్తగా ఆటో కొనుగోలు చేసే వారికి పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్దిక సాయం చేస్తుందని ఆయన ప్రకటించారు.పలుచోట్ల తనను ఆటోడ్రైవర్లు కలిసి తమ బాదలు చెప్పుకున్నారని ఆయన అన్నారు.
రోజంతా కష్టపడితే మూడు నుంచి ఐదొందలు వస్తాయని, అందులో నుంచి రోజూ 50 రూపాయలు లేదా వంద రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటున్నదని ఆయన చెప్పారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోకు ఫిట్‌నెస్, ఇన్సురెన్స్, రోడ్ టాక్స్ పత్రాలు లేనందున పోలీసులు డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు డ్రైవర్లు చెప్పారని ఆయన వివరించారు. అందువల్ల ఈ ఇబ్బందులు పడుతున్న ఆటోవాలాలను ఆదుకోవడానికి ప్రభుత్వమే పది వేల రూపాయల సాయం చేస్తుందని ఆయన ప్రకటించారు.