తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుబందు చెక్కులు&పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమంలో బాగంగా నర్సంపేట నియోజకవర్గంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి గత రెండురోజులుగా రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి తన సొంత ఖర్చులతో రైతులకు బోజన సదుపాయం కల్పించారు.
రాష్ట్రంలో రైతుల సంక్షేమమే తమ ద్యేయమని వారు బాగుండాలనే రైతుబందు పథకం ముఖ్యమంత్రిగారు తీసుకొచ్చారని,చెక్కుల కోసం వచ్చిన రైతులు ఇబ్బందులు పడకూడదనే ఈ బోజన సౌకర్యం కల్పించామని ఆయన అన్నారు.తిమ్మంపేటలో స్వయంగా బోజనాలు తయారు చేసి రైతులకు సహపంక్తి బోజనం ఏర్పాటు చేసి వడ్డించి,వారితోపాటు కలిసి బోజనం చేసాడు.
రైతుబందు చెక్కుల పంపిణీ సందర్బంగా పెద్ది సుదర్శన్ రెడ్డిగారు రైతులకు బోజన సదుపాయం కల్పించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్బంగా వారికి బోజనం పెట్టిన పెద్దికి అన్నదాత సుఖీభవ అంటూ దీవించారు.ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యే వరకు నియోజకవర్గంలోని అన్ని సెంటర్లలో ఈ ఉచిత బోజన సదుపాయం కల్పిస్తామని పెద్ది తెలిపారు.