కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో మొత్తం 224స్థానాలల్లో 222స్థానాలకు ఎన్నికలు జరిగాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మొత్తం డెబ్బై ఎనిమిది స్థానాలు,బీజేపీ పార్టీకి నూట నాలుగు స్థానాలు,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది స్థానాలు,ఇతరులకు రెండు స్థానాలు వచ్చాయి. అయితే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నరును కోరాలని నిర్ణయం తీసుకుంది.
అయితే ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎవరు అధికారాన్ని చేపడతారో ఆర్ధం కాకుండా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి అధికారం దూరం కావడానికి బీజేపీ పార్టీకి వందకుపైగా సీట్లు రావడానికి ప్రధాన కారణం గాలి బ్రదర్స్ అని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి .
ఈ క్రమంలో గాలి జనర్ధన్ రెడ్డి ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగి తన తమ్ముళ్ళు అయిన గాలి సోమశేఖర రెడ్డి బళ్లారి సిటీలో , గాలి కరుణాకర్‌రెడ్డి హరప్పనహళ్లిలో గెలిపించుకోవడమే కాకుండా ఎకంగా తన అనుచరులుగా ఉన్న మొత్తం తొమ్మిది మందిలో ఆరుగుర్ని గెలిపించుకున్నారు. అయితే దగ్గర ఉండి మరి మరో అరవై మంది బీజేపీ అభ్యర్థులు గెలవడానికి కృషి చేశారు. అందుకే తన తమ్ముడు శ్రీరాములకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారని కూడా సమాచారం ..ఏది ఏమైతే గాలి ఎంట్రీతో కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యనిస్తున్నారు ..