తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల మదిని దోచుకోవడమే కాకుండా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఏకంగా తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు .
అయితే తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మద్దూరు మండలంలో ఎక్కమేడు గ్రామానికి చెందిన ప్రజలకు టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పలు పథకాలు నచ్చడంతో గ్రామానికి చెందిన సామాన్య ప్రజానీకం దగ్గర నుండి ప్రజాప్రతినిధుల వరకు అందరూ మొత్తం తొంబై శాతం మంది గులాబీ గూటికి చేరారు .మంత్రి జూపల్లి వీరందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ..