ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 2000 కీలో మీటర్లు చేరుకుంది. వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎప్పటికప్పుడు వైఎస్ జగన్‌పై ప్రజాదారణ పెరగడం, టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడం, మరోవైపు పలు టీవీ ఛానళ్లు, రాజకీయ పార్టీలు చేస్తున్న సర్వేల్లోనూ.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చేప్పిన తెలిసిందే. ఇందులో బాగంగానే ఏపీ అంతట అధికార టీడీపీ …బీజేపీ నుండి భారీగా వైసీపీలోకి వలసలు మొదలైనాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ చీఫ్‌గా కన్నా లక్ష్మీనారాయణను నియమించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో కలకలం చోటు చేసుకుంది. కన్నాకు బాధ్యతలు ఇవ్వడంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గం ఆగ్రహంతో ఉంది. కన్నాకు పార్టీ చీఫ్ పదవి ఇవ్వడంతో సోము వీర్రాజు కినుక వహించారు. ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. పార్టీ మారే వ్యక్తికి పదవులు ఇవ్వడం ఏమిటని అసంతృప్తితో ఉన్నారు.కాగా, కన్నా లక్మీనారాయణ ఇటీవల వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం సాగింది. అయితే, అనారోగ్యం కారణంగా ఆయన చేరిక వాయిదా పడింది. కానీ హఠాత్తుగా మళ్లీ ఆయనను పార్టీ చీఫ్‌గా చేశారు. దీంతో పార్టీ చీఫ్ పదవి తనకు వస్తుందని సోము వీర్రాజు చాలా కాలంగా వేచిచూస్తున్న రాకపోవడంతో వైసీపీలోకి వెళ్లాలని అనుకున్నట్లు సమచారం. మరి కొన్ని రోజుల్లో తమ నాయకులు,కార్యకర్తలో కలసి ప్రకటించే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్ చల్ చేస్తుంది.