ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం 161వ రోజు దెందులూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్‌కు ప్రజలు ఆద్యాంతం పూలతో స్వాగతం పలుకుతున్నారు. మరో పక్క వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూ.. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ప్రజలను ఉత్తేజ పరుస్తూ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ముందుకు సాగుతున్నారు.
see also : ఏయ్ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’కేఈ ప్రభాకర్.. .తుగ్గలి నాగేంద్ర హెచ్చరిక
అయితే, జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టిన రెండో రోజే వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా వైఎస్ జగన్ సమక్షంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వడ్లపట్ల శ్రీనివాసరావు, దుగ్గిరాలకు చెందిన మాజీ సర్పంచ్ ఆనందరావుతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్ జగన్ వారికి వైసీపీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.