వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. అయితే, ఆ వెంటనే పక్కనే ఉన్న బాడీగార్డ్స్ తేరుకుని జగన్‌ను పట్టుకోవడంతో.. జగన్‌కు తృటిలో ప్రమాదం తప్పినట్లయింది.
కాగా, జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ పాదయాత్రకు అంత క్రేజ్ రావడానికి గల కారణాలను రాజకీయ విశ్లేషకులు ఏమని వివరిస్తున్నారంటే..!
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన రైతన్నలు, పలువురు సామాన్య ప్రజలను ఓదార్చేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను కాంగ్రెస్ అధినేత్రి అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే, తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారిని ఎలాగైనా కలుసుకుని.. వారికి బాసటగా ఉండి ధైర్యం చెప్పాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టవకాశమున్నప్పటికీ.. వాటన్నిటిని వదులుకుని ఓదార్పు యాత్ర చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే సీన్‌ను రిపీట్ చేస్తూ.. నేటి ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేక హోదాపై నిలదీస్తూ.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరిస్తూ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఆదివారం మణుగులూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే, పాదయాత్రలో భాగంగా జగన్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ రోడ్డుపై నడుస్తూ ఉన్న సమయంలో .. జగన్‌కు కూసంత దూరంలో ఒక్క సారిగా ప్రజలు పోటెత్తడంతో ఒకరిపై మరొకరు పడ్డారు. ఇలా ఒక్కొక్కరిగా పడుతున్న సమయంలో గమనించిన సెక్యూరిటీ జగన్ చుట్టూరా కవచంలా నిలబడ్డారు. దీంతో వైఎస్ జగన్ తన పాదయాత్రను సజావుగా కొనసాగించారు. ఏదేమైనా ప్రజాదారణతో.. ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతున్న తరుణంలో ఇటువంటి సంఘటనలు సహజమేనని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.