ప్రేమ పెళ్లికి ఇంట్లో వారు ఓప్పుకోకపోతే సాదరణంగా ..ఫ్యామీలి కి చేప్పకుండ..స్నెహితుల సహయంంతో..లేదా తెలిసిన వారి సహయంతో లేచిపోయి ఏ గుడిలోనో..రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటువుటారు. ఇలా జరిగిన ప్రేమ పెళ్లీలను మనం ఏన్నో చూశాం. కాని పెళ్లి అంగీకరించని తల్లిదండ్రులకు భోజనంలో మత్తుమందు కలిపిన ఓ యువతి ప్రియుడితో పరారైంది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలూకా ముక్కురుంబై గ్రామానికి చెందిన పిచ్చాండి, అంబిక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో బీఏ చదివిన దివ్య అదే ప్రాంతానికి చెందిన కుమార్‌విక్రమ్‌రాజాను ప్రేమించింది. వారి వివాహానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించ లేదు.
ఈ క్రమంలో సైన్యంలో పనిచేస్తున్న కుమార్ విక్రమ్‌రాజా సెలవుపై స్వగ్రామానికి వచ్చి దివ్యను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి దివ్య భోజనంలో మత్తుమందు కలుపడంతో, ఆమె తల్లిదండ్రులు. సోదరి స్పృహ కోల్పోవడంతో దివ్య ప్రియుడితో వెళ్ళి వివాహం చేసుకుంది.. స్పృహ లోకి వచ్చిన తల్లిదండ్రులు బీరువాలోని 15 సవర్ల బంగారం, రూ.20 వేలు పోయాయని పోలీసులకు ఫిర్యాదుచేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న నూతన వధూవరులు తామిద్దరం ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని, నగలు, నగదును తీసుకెళ్లలేదని పోలీసులకు తెలిపారు. వారిద్దరు మేజర్లు కావడంతో వారివురిని పోలీసులు వదలేశారు.