జబర్దస్త్ షో ద్వారా తెలుగు సినీ జనాలకు బాగా దగ్గరైన యాంకర్లలో రష్మీ ఒకరు. ఎంతలా అంటే.. అటు బుల్లితెరపై.. ఇటు వెండి తెరపై యువతకు మాంచి కిక్ ఇచ్చి, తనదైన నటనతో బాగా క్రేజ్ సంపాదించుకునేంతలా. అందులోను తాను యాంకరింగ్ చేసిన షోలు, నటించిన చిత్రాలు వరుసగా విజయాలు సాధిస్తుండటంతో తన అందాల ఆరబోతకు హద్దులను చెరిపేసింది రష్మీ. బుల్లితెరను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ నిత్యం అభిమానులకు దగ్గరవుతూ యాంకర్ కమ్ యాక్టర్ అంటూ ప్రశంసలందుకుంటోంది.
రష్మీ తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయిన మాట ఎంత వాస్తవమో.. అదే స్థాయిలో రష్మీపై గాసిప్స్ వచ్చాయన్న మాట కూడా అంతే వాస్తవం. మొన్నటికి మొన్న బ్రహ్మాజీ రష్మీ మధ్య ఎఫైర్ అంటూ పలు వార్తలు షికార్లు చేశాయి. అంతకు ముందు సుధీర్ రష్మీ పెళ్లి కూడా చేసేసుకున్నారంటూ వార్తలు కూడా గుప్పుమన్నాయి. తీరా అన్ని పుకార్లేనని తేల్చేశారు బ్రహ్మాజీ, సుధీర్, రష్మీ.
ఇదిలా ఉండగా టాలీవుడ్లో ఎప్పట్నుంచో ఉన్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఇటీవల కాలంలో పడగ విప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పలువురు స్టార్ హీరోయిన్లు మీడియా ముఖంగా స్పందించి మరీ పలువురు స్టార్ డైరెక్టర్లతోపాటు.. బఢా ప్రొడ్యూసర్ల పేర్లను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై స్పందించిన రష్మీ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని కేవలం ఒక్క సినీ ఇండస్ట్రీకి కట్టబెట్టడం మించిది కాదని, అన్ని రంగాల్లోనూ మహిళలు తీవ్ర లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని చెప్పింది. గతంలో తనను కూడా కొందరు ఇలా అడిగారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో పలు ఛాన్సులు కూడా మిస్సైనట్టు చెప్పుకొచ్చింది రష్మీ.
టాలెంట్ ఉన్నా.. లేకపోయినా పక్కా పల్లెటూళ్ల నుంచి చాలా మంది సినిమా మీద ఉన్న పిచ్చితో హైదరాబాద్కు వస్తారని, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినీ ఇండస్ట్రీకి చెందన కార్యాలయాల చుట్టూ తిరిగే వారు ఇప్పటికీ చాలామందే ఉన్నారని కన్నీళ్లుపెట్టుకుంది. అటువంటి వారిని సహృదయంతో ఆదరించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చెప్పింది రష్మీ.