తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ మరో సంచలన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి విప్లవాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకానికి సహాయం చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు. వివిధ రూపాల్లో వారు తమ ఆసక్తిని పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అలా సహాయం చేసేవారికి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది.
రైతుబంధుకు సహాయం చేసే వారికోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఆదివారం వెల్లడించారు. ఈ విప్లవాత్మక పథకానికి విరాళం ఇచ్చేందుకు అనేకమంది ముందుకు వచ్చారని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇలాంటి ఆసక్తిని చూపే వారు <https://www.esevaonline.