తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం అద్వితీయంగా ముందుకు సాగుతోంది. రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందుకున్న రైతులంతా రైతు బంధువు
సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు . రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే రైతు బాంధవుడని కొనియాడుతున్నారు.పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకు రైతుల గురించి గొప్పలు చెప్పిన నేతలే ఉన్నారే తప్పా .. వారిని ఆదుకున్న వారు లేరు.కాని సీఎం కేసీఆర్ సారధ్యంలో తొలిసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా భధ్రతతో కూడిన కొత్త పాస్‌పుస్తకాలతో పాటు ఎకరాకు రూ.4వేల చొప్పున అన్నదాతలకు రైతు బంధు పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన 344మందికి రైతు బంధు వర్తించింది. రూ.26లక్షలను వారికి అందగా,ఆ రైతుల్లో హర్షం వ్యక్తమైంది.
ఈ మేరకు ఆంధప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కొమటికుంటలో శనివారం అక్కడి రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేసీఆర్ రైతుపక్షపాతి అనే దానికి ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా రైతుబంధు పథకాన్ని వర్తింప చేయడమే నిదర్శనమన్నారు. తమకు తెలంగాణ రాష్ట్రం కాచవరం రెవెన్యూలో 650ఎకరాలుండగా, తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు కింద రూ.26 లక్షలు మంజూరు చేసిందన్నారు. కేసీఆర్ సహృదయంతో తెలంగాణలో భూములున్న రైతులందరికీ రైతుబంధు వర్తింప చేయాలని నిర్ణయించడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు.