ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్ వేసిన 4వ ఓవర్ 3వ బంతికి హేల్స(2) రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత నిలకడగా ఆడి 142 పరుగులు చేశారు. తరువాత 79 పరుగుల వద్ద హర్భజన్ క్యాచ్ పట్టడంతో ధావన్ ఔటయ్యాడు. వేంటనే విలియమ్‌సన్ 51 పరుగు వద్ద బ్రావొకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
