ఐపీఎల్ 2018 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి రుచి చూపింది.ఐపీఎల్ లో భాగంగా పూణే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈ రోజు జరిగిన మ్యచ్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై..19 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా విజయం సాధించింది. . 13 ఓవర్ల వరకూ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఓపెనర్లు అంబటి రాయుడు, వాట్సన్ 134 పరుగుల భాగస్వామ్యన్ని నమోదు చేశారు.
