ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లోకి పాదయత్ర చేరుకున్న సంగతి తెల్సిందే .
ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భీమవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గాదిరాజు సుబ్బరాజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారు అని ఆయన మీడియాకు వివరించారు .అంతే కాకుండా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మంత్రులు వైసీపీ గూటికి చేరనున్నారు అని ఆయన మీడియాకు వివరించారు ..