Home / ANDHRAPRADESH / భూమ అఖిల‌ప్రియ ఎవ‌రితో..ఎక్క‌డ..ఎప్పుడు ప్రేమ‌లో ప‌డిందో తెలుసా..!

భూమ అఖిల‌ప్రియ ఎవ‌రితో..ఎక్క‌డ..ఎప్పుడు ప్రేమ‌లో ప‌డిందో తెలుసా..!

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కానున్నారు. ఇప్పటికే అఖిల ప్రియ ఇంట పెళ్లి వేడుక మొదలైంది. ఎవ‌రితో ఇప్ప‌టికే మీకు కూడ తెలిసి వుంటుంది. వ‌రుడు ఎవ‌రంటే మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ .  హైదరాబాద్ లోని అఖిల‌ప్రియ నివాసంలో నిశ్చితార్థ వేడుక కూడ జ‌రిగింది. వీరి వివాహం ఆగ‌ష్ఠు నెలలోనే జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, భార్గవ్, అఖిలప్రియ మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు తెలిసింది. ఐదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలార‌ని స‌మ‌చారం.అంతేకాదు ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు..ప్రభుత్వంలో ఉన్న వారందరికీ తెలిసిన సంగతే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక‌పోతే ఇంత‌క ముందే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మేనమామ, ప్రస్తుత కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి కుమారుడు నరేన్‌ రామాంజనేయరెడ్డితో అఖిలప్రియకు మొదట వివాహం జరిగింది. అయితే.. వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. భార్గవ్‌కు కూడా గతంలో వివాహం జరిగింది. ఆయన మాజీ డీజీపీ సాంబశివరావు కుమార్తెను వివాహమాడారు. భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం అఖిలప్రియతో వివాహ నిశ్చితార్థం చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.అంటే ఇద్ద‌రికి ఇది రెండో వివాహం అని స్ప‌ష్టంగా తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మరణానాంతరం అఖిలప్రియ రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణానంతరం చంద్రబాబు అఖిలప్రియను తన కేబినెట్‌లో చేర్చుకుని పర్యాటక శాఖ మంత్రి అయ్యారు. ఇప్పుడు వీరిద్ద‌రి రెండో వివాహం ఆగస్టు 29న జరపడానికి ముహూర్తం నిర్ణయించిన‌ట్లు తెలుస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat