ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా.. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా మంచి హిట్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా.. ఈ వీకెండ్ తో రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. విడుదలైన తొలిరోజు నుంచే రికార్డుల వేటను కొనసాగించింది .
ఫస్ట్ డే రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని నిర్మాత శివ ప్రకటించారు.ఈ సినిమా మొదటి వారంలో రూ.161 కోట్లు, రెండు వారాలకు రూ. 190 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకున్నట్టు వెల్లడించారు. దీంతో ఈ మూవీ మరో మైలురాయిని చేరుకుంది. మూడు వారాల్లో రూ.205 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోందని సినిమా యూనిట్ ప్రకటించింది .ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.