తెలంగాణలోని మహిళలను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీహబ్ మరో ప్రత్యేకతను తన ఖాతాలో నమోదు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్‌గా ఉండే నీతి అయోగ్ వీహబ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌ను నిర్వహించిన సందర్భంగా మహిళలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆ హామీని స్వల్పకాలంలోనే ఆచరణ రూపంలో పెడుతూ వీహబ్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలోని మహిళల నుంచి ప్రస్తుతం వీహబ్ దఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే ఇదే సందర్భంలో ప్రధాని సారథ్యంలో నడిచే నీతి అయోగ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నీతి అయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫాం (డబ్లూ్యఈపీ) వీహబ్‌తో ఒప్పందానికి ముందుకు వచ్చింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించిన ఆవిష్కరణ నైపుణ్యాలకు గుర్తింపునిచ్చేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు డబ్లూ్యఈపీ ఏర్పడింది. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇదే ఉద్దేశంతో పనిచేస్తున్న పలు సంస్థలతో కలిసి పనిచేసే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రథమ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీహబ్‌తో కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల వీహబ్ సీఈఓ దీప్తి రావుల హర్షం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా… https://wep.gov.in/register/ లింక్ ద్వారా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫాం విసయంలో ఆసక్తి ఉన్నవారు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.