ఈ రోజు జరుగుతున్న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తమదేనని బీజేపీ సీఎం అభ్యర్ధి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని షికారిపుర నుంచి పోటీ చేస్తున్న ఆయన..ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షికారిపుర నుంచి 50వేలకు పైగా మెజార్టీతో గెలుపొందుతానని, కర్నాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు . తమకు 140 నుంచి 145 సీట్లు వస్తాయని, ఈ నెల 17 సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు . ఓటర్లను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ డబ్బులు పంచుతోందని, వారిపై చర్యలు తీసుకోవాలని యడ్యూరప్ప ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
BJP Chief Ministerial candidate BS Yeddyurappa casts his vote in Shikarpur, Shimoga. #KarnatakaElections2018 pic.twitter.com/NCrU6NFrMM
— ANI (@ANI) May 12, 2018
మరోవైపు మాజీ ప్రధాని హెచ్.డి. దేవే గౌడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హసన్ జిల్లాలోని హోలెనర్సిపుర పట్టణంలోని పోలింగ్ బూత్ నెం. 244లో ఆయన ఓటు వేశారు. అనంతరం దేవే గౌడ మాట్లాడుతూ తాము ఈ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నమన్నారు. ప్రజలు తమవైపే ఉన్నారని ఆయన చెప్పారు.
JD(S)'s H. D. Deve Gowda casts his vote at polling booth no.244 in Holenarasipura town in Hassan district, says, 'We expect a possibility of forming the government, we have done well.' #KarnatakaElections2018 pic.twitter.com/depYaB4Y65
— ANI (@ANI) May 12, 2018