ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ప్యానా సోనిక్ ఇండియా కంపెనీ సరికొత్తగా పి95 పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర కేవలం రూ.3,999. ఈ ఫోన్ లో ఫేస్ అన్ లాక్, వాయిస్ రికగ్నిషన్ వంటి అద్భుతమైన సదుపాయాలను కంపెనీ కల్పించింది .ఈ ఫోన్ గోల్డ్, డార్క్ గ్రే, బ్లూ రంగుల్లో లభిస్తుంది. మంచి డిజైన్, చక్కని పనితీరుతో ఈ ఫోన్ యూజర్ల అభిమానాన్ని చూరగొంటుందన్న అభిప్రాయాన్ని ప్యానాసోనిక్ ఇండియా మొబిలిటీ డివిజన్ బిజినెస్ హెడ్ పంకజ్ రాణా పేర్కొన్నారు.
ఫీచర్లు
ఈ మొబైల్‌లో 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే వుంటుంది.
1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
1జీబీ ర్యామ్
16జీబీ అంతర్గత స్టోరేజీ
128జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఎక్స్ పాండబుల్
2,600 ఎంఏహెచ్ బ్యాటరీ
8 మెగా పిక్సల్ రియర్ కెమెరా
5మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
ఆండ్రాయిడ్ నౌగత్ 7.1.2 ఓఎస్ ఉన్నాయి.