భారతదేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి.అయితే ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఏ పార్టీకి స‍్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ప్రస్తుతం మంత్రి కేటీఆర్ చేసిన ఆ ట్వీట్ వైరల్ గా మారింది.
ఇంతకీ మంత్రి ఏమని ట్వీట్ చేశారంటే..ఎగ్టిట్ పోల్స్ ఫలితాలను అర్థం చేసుకోవడం కంటే కన్‌ఫ్యూస్ అయ్యే విషయం మరొకటి లేదంటూ అభిప్రాయపడ్డారు. రెండు ఇంగ్లీష్ చానళ్లు బీజేపీ అంటుంటే.. మరో రెండు చానళ్లు కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని చూపిసస్తున్నాయి. కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్‌లా కనిపిస్తున్నాయంటూ చమత్కరిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.ఆ ట్వీట్ మీకోసం..
Nothing can be more confusing than watching the Karnataka exit poll predictions on English news channels ?
Two channels calling it for BJP & two others to Congress. Looks like the exit polls are hung too ?
— KTR (@KTRTRS) May 12, 2018