దేశం మొత్తం ఆసక్తిగా ఎదిరిచూస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఈ రోజు ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్ జరగనుంది.మొత్తం 222నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది.అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 2600 మంది అభ్యర్ధుల భవిష్యత్తును కన్నడ ఓటర్లు తేల్చనున్నారు. కర్ణాటక ఎన్నికల కోసం మొత్తం 55,600 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.ఇప్పటికే ఓటర్లు పోలింగ్ బుత్ ల వద్దకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి యడ్యూరప్ప షికార్పూర్, షిమోగాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కర్ణాటక వ్యాప్తంగా సుమారు 4.96 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.కన్నడ ఓటర్ల తీర్పు ఎవరి వైపు ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కర్ణాటకలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీ తలపడ్డాయి. ప్రచారంలోనూ నువ్వా? నేనా? అన్న రీతిలో ముందుకు సాగాయి.జాతీయ స్థాయి నేతలందరూ కన్నడనాట కాలుమోపి మరీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు.
BJP Chief Ministerial candidate BS Yeddyurappa casts his vote in Shikarpur, Shimoga. #KarnatakaElections2018 pic.twitter.com/NCrU6NFrMM
— ANI (@ANI) May 12, 2018