వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, జలీల్ ఖాన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చంద్రబాబు ఇలానే అభివృద్ధి చేస్తే 2019లోనూ టీడీపీనే అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. అలాగే, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పార్టీలోని ప్రతీ ఒక్కరిని కలిసి, సమన్వయపరుచుకుంటూ టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారన్నారు.
see also : వైఎస్ జగన్ సంచలన నిర్ణయం..!!
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గురించి మాట్లాడిన జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే ఏమిటో మాకు తెలుసు, రెండు సంవత్సరాలుగా వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నా.. అయితే, టీడీపీలో చేరగానే వైఎస్ జగన్ స్పందించి జలీల్ ఖాన్ అన్నా నీవు వైసీపీ టిక్కెట్‌పై గెలిచావని అంటున్నారు.. కానీ వైసీపీ పార్టీ బలం మీద గెలిస్తే.. నాతోపాటు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వైసీపీనే రావాలి కదా..? కేవలం నేనొక్కడినే ఎందుకు గెలిచాను…? అంటే వైసీపీకి బలం లేదన్న మాట అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
జగన్ పాదయాత్ర చేసిన ప్రతీ చోటా ప్రజలు పసుపు నీళ్లు చల్లి శుద్ది చేస్తున్నారని, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కూడా అదే రీతిలో జగన్‌ను సాగనంపేందుకు ఇప్పటికే పసుపునీళ్లు సిద్ధంగా ఉంచుకున్నారని ఎద్దేవ చేశారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్.