ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ మంత్రి నారాయణకు కూడా బంధువు అవుతారు. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కాబోతున్నారు. హైదరాబాద్ లో తన నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. వీరి వివాహం వచ్చే నెలలోనే జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
