టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ) చైర్మన్ వర్ల రామయ్య ఓ దళిత యువకుడిపై జులుం ప్రదర్శించి, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..గురువారం మచిలీపట్నం బస్టాండ్‌లో రామయ్య అధికారులతో కలసి బస్సులను తనఖీ చేశారు. ఓ బస్సులోని యువకుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ఉండడంతో రామయ్య అహం దెబ్బతింది. నిప్పులు తొక్కిన కోతిలా చెలరేగిపోయాడు. ‘నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవా? నీ కులం ఏంటో చెప్పు? మాల లేదా మాదిగా?. మాదిగలు అసలు చదవరు. బాగుపడరు..ఈ వెధవ పరీక్ష కూడా రాసి ఉండడు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పొలం ఉందా? బ్యాంకులో ఎన్ని లక్షలు ఉన్నాయి? డబ్బులు లేకపోతే ఎలా చదువుకుంటావ్?. ఫోన్లు గీన్లు మానేసి చదువుకో.. నాకొడుకు.. ’అంటూ దారుణంగా అవమానించాడు.అయితే రామయ్య అలా నడంతో సదరు ప్రయాణికుడు సహా చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు.