తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 4వేల చొప్పున పట్టుబడి సాయం అందిస్తుంది.అందులోభాగంగానే ఈ రోజు వరంగల్ అర్బన్ జిల్లా, ధర్మసాగర్ మండలం, క్యాతంపల్లి గ్రామంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ,మహమూద్ అలీవ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి , రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కడియం మాట్లాడారు. కొత్త పథకాలతో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక… ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని అయన ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, జడ్పి చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే రాజయ్య, మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రాజేశ్ తివారి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, సీసీ ఎల్ ఏ కమిషనర్ వాకాటి కరుణ, కలెక్టర్ ఆమ్రపాలి మరియు స్థానిక అధికారులు, నేతలు పాల్గొన్నారు.