తనకు గుర్తింపు వచ్చేవరకు తెలంగాణ టీడీపీని వాడుకొని…టీ.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి..తన అవసరం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ ఆవేదనలో ఉన్నారు. ఈ మధ్య ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు ఇచ్చారని… అందుకే కాంగ్రెస్‌లోకి వచ్చానని తెలిపిన సంగతి తెలిసిందే.
అంతే కాదు ఇప్పుడు కాకున్నా ఎప్పటికైనా ముఖ్యమంత్రినవుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.రేవంత్ కామెంట్ల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయన్ను ఢిల్లీకి పిలిచారని సమాచారం. ఈనెల 15వ తేదీన జరిగే భేటీ సందర్భంగా ఆయన్ను వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది.
అయితే రేవంత్‌రెడ్డి వర్గీయులు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఇచ్చే బాధ్యతలపై త్వరలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోనుందని అంటుననారు. అయితే రాహుల్‌తో జరిగే సమావేశంలో రేవంత్ తనకు ఏదైనా పదవి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా, రేవంత్‌రెడ్డికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.