మామూలుగా మనకు ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. రక రకాలుగా పొగుడుతుంటారు. కానీ, కొన్ని కాంప్లిమెంట్స్ మాత్రం జీవితాంతం గుర్తుంటాయి. వాటిని ఎప్పటికీ మరిచిపోలేం. అలాంటిది ఒక పది సంవత్సరాల క్రితం పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేస్తే పవన్ కల్యాణ్ ఉన్నారు. పవన్ కల్యాన్ లైన్‌లోకి వచ్చి నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది.. మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండీ.. ఆ కాంప్లిమెంట్‌ని అస్సలు మరిచిపోలేను. థాంక్యూ వెరీ మచ్ పవన్ కల్యాణ్ గారు అంటూ టాలీవుడ్ మాస్ మహారాజగా వెండితెరపై దనదైన నటశైలితో రాణిస్తున్న హీరో రవితేజ అన్న మాటలివి.
కాగా, రవితేజ, మాళవిక హీరోహీరోయిన్లుగా, అలాగే జగపతిబాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్న చిత్రం నేల టికెట్. రామ్ తాళ్లూరి నిర్మాతగా, శక్తికాంత్ కార్తీక్ సంగీత దర్శకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. అయితే, ఈ చిత్ర బృందం శుక్రవారం ఆడియో వేడుక జరపుకుంది. ఈ ఆడియో వేడుకకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. పవన్ కల్యాన్‌కు, తనకు మధ్య గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేస్తూ పై విధంగా స్పందించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తన అన్నయ్య చిరంజీవి తరహాలో కష్టపడి పైకొచ్చిన వారిలో రవితేజ ఒకరని ప్రశంసలతో ముంచెత్తారు. తాను హీరో కాకముందే రవితేజను నటుడిగా చూశానని, ఆ సమయంలో తాను వీధులవెంబడి తిరుగుతున్న ఉదంతాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.