ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. అసలే చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వరకు భారీ అవినీతి జరిగిందని ఆధారాలతో సహా అటు సోషల్ మీడియాతోపాటు ఇటు పలు సందర్భాల్లో పచ్చ మీడియా కూడా టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయడంతోపాటు పత్రికల్లో ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. మరో పక్క సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ.. చంద్రబాబుపై ఉన్న కేసుల విచారణ గడువు కూడా అంతే వేగంగా పూర్తవుతున్నాయని, త్వరలో జైలు కన్ఫాం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అందులో మొదటగా ప్రస్థావనకు వచ్చేది చంద్రబాబు ఓటుకు నోటు కేసు. నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తుతం ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రధానమైన వార్త ఇదే. సరిగ్గా రెండు యేండ్ల కిందట పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు పోవడం ఖాయం .. ఇప్పటికే ఏసీబీ కేసు ఫైల్ చేసింది. అందుకు తగ్గట్లు అన్ని ఆధారాలను కూడా సంపాదించింది అని కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే, సీఎం చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో గతంలోనే జైలుకు వెళ్లాల్సింది. అయితే, చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ చాణుక్యతతో ప్రధాని మోడీ వద్ద ఏపీ ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ ఓటుకు నోటు కేసులో స్టే తెచ్చుకున్నారన్నది జగమెరిగిన సత్యం అని ప్రతిపక్షాల ఆరోపణ . అందులోను అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు పలు సందర్భాల్లో ఏపీ, తెలంగాణలో ముమ్మర పర్యటనలు చేయడం, ఆ వెంటనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి తన మకాంను మార్చిన ఉదంతం పలు అనుమానాలకు తావివ్వక మానదు అంటూ కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్న సంగతి కూడా తెల్సిందే .
ఇదిలా ఉండగా.. రెండేళ్ల క్రితం జరిగి.. ముగిసిన అధ్యాయనంలా ఉన్న ఓటుకు నోటు కేసు.. మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను తెలంగాణ పోలీసులు సేకరించారు. అందులో చంద్రబాబు వాయిస్‌కు.. ఫోన్ కాల్ వాయిస్‌కు వందకు వంద శాతం సరిపోవడంతో తెలంగాణ పోలీసులు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా కేసు ఫైల్ చేశారని, ఏ నిమిషమైనా.. చంద్రబాబును అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా ప్రధాన తెలుగు మీడియాలో కూడా ప్రసారం జరుగుతుంది .
అయితే, ఓటుకు నోటు కేసులో గతంలో తనను కాపాడిన కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం చంద్రబాబు ప్రస్తుతం మంతనాలు జరుపుతున్నాడని, ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడుకు ఫోన్ చేశాడని, తనను ఓటుకు నోటు కేసు నుంచి రక్షించాలని కోరినట్టు సోషల్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి .అయితే అప్పుడటంటే వెంకయ్య నాయుడు హోదా కేంద్ర మంత్రి.. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి అంటే రాజకీయ నేతలతో కానీ రాజకీయాలతో కానీ సంబంధాలు ఉండకూడదు ..అందుకే ఆయన బాబును పక్కన పెట్టేశారు అని బాబు ను కాపాడటం కష్టం అని కూడా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు .చూడాలి మరి ఇప్పటికే నలబై కేసుల్లో ఉన్న చంద్రబాబు పద్దెనిమిది కేసుల్లో స్టేలు తెచ్చుకొన్న ఆయన ఓటుకు నోటు కేసులో ఎలా బయటపడతారో ..!