గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు. రైతు బంధు పథకంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతు బంధు చెక్కులు అందుకుంటున్న రైతులు నేరుగా బ్యాంకుల వద్దకు వెళ్లి నగదును డ్రా చేసుకుంటున్నారు.
అయితే రైతు బంధు చెక్కు ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలంటే రైతులు తమ సమీపంలోని ఆంధ్రాబ్యాంక్ (మీ చెక్కు ఏ బ్యాంకుదైతే అదే బ్యాంకు) కు వెళ్లాలి. ఆ బ్యాంకులో మీకు అకౌంట్ ఉండనవసరం లేదు. అక్కడి క్యాషియర్ కి మీ చెక్కు, పట్టాదార్ పాస్ బుక్కు మొదటి పేజి, మీ ఆధార్ కార్డ్ జీరాక్స్ కాపీలు అందజేయాలి. చెక్కు వెనుక, జీరాక్స్ కాపీలలో మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను సరిపోల్చుకున్నక్యాషియర్, చెక్కుపై ఉన్న మొత్తానికి డబ్బులు అందజేస్తారు.అప్పుడు ఆ డబ్బును తీసుకొని వెళ్ళవచ్చు..