తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్ లో కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శిరీష ( 20) అనే డిగ్రీ అమ్మాయి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.అయితే ఆమె స్నేహితుడే ఈ నీచమైన పని చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే..ఈ హత్య గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగినప్పటికీ..రాత్రి 9గంటల సమయానికి కూడా వెలుగు చూడలేదు.రిసార్ట్స్ వారి సహాయంతోనే ఈ హత్య జరిగిందని అనుమానాలు వినిపిస్తున్నాయి .
శిరీషను గత కొంతకాలంగా ఆమె స్నేహితుడు సాయి ప్రసాద్ ప్రేమించమని వేధిస్తున్నాడని… ఇందులో బాగంగా ఆమెను నమ్మించి గురువారం ప్రగతి రిసార్ట్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే ఏకాంతంగా గడిపిన వీరిద్దరూ.. పెళ్లి విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కత్తితో గొంతు కోసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఇంతవరకు మంచిగానే ఉన్నా.. ఈ హత్య పట్ల మరికొన్ని అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి.
పెళ్ళికాని వాళ్ళకు రూమ్స్ ఎలా ఇస్తారని..?అధార్ కార్డులో భార్య ,భర్తల పేర్లు ఉంటాయి కదా..?అవి ఏమి చెక్ చేయకుండా రూమ్స్ ఎలా ఇస్తారని అనుమానిస్తున్నారు.అంతేకాకుండా ప్రసాద్ ఒక్కడే ఈ హత్య చేయలేదు..అతని స్నేహితుల సహాయంతోనే ఈ హత్యకు పాల్పడ్డాడు అని రిసార్ట్స్ వారి సహాయంతోనే ఈ హత్య చేశారని అనుమానిస్తున్నారు.శిరీష డెడ్ బాడీతో ఆమె తల్లిదండ్రులు ప్రగతి రిసార్ట్స్ ముందు ఆందోళనకు దిగారు. తమ కూతురుని చంపిన వాడిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.