తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంభీరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.ఆ తరువాత రైతు బంధు పథకం ద్వార విడుదలైన చెక్కులను రైతన్నలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకం కింద రూ.100కోట్లను ఇస్తున్నట్లు చెప్పారు,జూన్ 2 నుంచే రైతులకు రూ.5లక్షల రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.రానున్న యాసంగి నాటికీ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టమని అన్నారు.ఈ పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని అన్నారు.కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతన్నలకు చుక్కలు చూపిస్తే.. కేసీఆర్ సర్కార్ 3 ఏళ్లలోనే రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు చెక్కులను అందిస్తున్నామని కేటీ ఆర్ అన్నారు.